telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా పై నిర్బంధాన్ని భరించే స్థితి తమకు లేదు: ఇమ్రాన్

Imran

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వివిధ దేశాల్లో వీలైనంత వరకు నగరాలు, వివిధ ప్రాంతాలను మూసివేసి.. జనం ఇళ్లలోంచి బయటికి రాకుండా చూడాలని ఆదేశించారు. కానీ తాము అలా చేయలేమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో నిర్బంధాలను భరించే స్థితిలో తమ దేశం లేదని చెప్పారు. అలాగైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్నారు.

కరోనా వైరస్ ను నియంత్రించేందుకు వివిధ దేశాలు అవలంబిస్తున్న తరహాలో నగరాల నిర్బంధాన్ని పాకిస్థాన్ అమలు చేయలేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ ప్రతిపాదనలను తమ దేశ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. దేశ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే జనం ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నిర్బంధం విధిస్తే ప్రజలు ఆకలితో మరణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నారు.

Related posts