telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

సీఎం జగన్ కు సినీ నిర్మాతల మండలి లేఖ

jagan

ఏపీ సీఎం జగన్ కు సినీ నిర్మాతల మండలి లేఖ రాసింది. చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరింది. స్టూడియోలు, ల్యాబ్స్ తో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర పరిశ్రమ వర్గాల ఇళ్ల కోసం స్థలాలను కేటాయించాలని లేఖలో విన్నవించింది. జీవో నంబర్ 45 ద్వారా రాష్ట్రంలో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చిన సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలకు, ల్యాబ్స్ నిర్మించుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని తెలిపారు. ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర వర్గాల కోసం ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారని తెలిపారు. అదే మాదిరి ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి స్థలాలను కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

Related posts