ఐఏఎస్ అకాడమీలో శిక్షణ అంశంగా సిరిసిల్ల జిల్లా ఎంపికకావడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జల నిర్వహణ నమూనాకు దక్కిన మరో గుర్తింపు అని కొనియాడారు. తెలంగాణ జల విధానంపై అధ్యయనాలు జరుగుతాయని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు. ప్రస్తుతం సిరిసిల్లకు సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు అందడం ప్రారంభమైందని మంత్రి అన్నారు. భవిష్యత్‌లో దేశంలోనే ఆదర్శవంతమైన జల నిర్వహణకు చిరునామాగా సిరిసిల్ల జిల్లాను నిలిపే ప్రయత్నం చేస్తామని కేటీఆర్ తెలిపారు.
జాతీయ స్థాయిలో ఆదర్శంగా సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్‌మెంట్ మోడల్‌ను శిక్షణ అంశంగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎంచుకుందని తెలిపారు. ఐఏఎస్ ట్రైనీలకు సిరిసిల్ల జిల్లా వాటర్ మేనేజ్‌మెంట్ మోడల్ పాఠాలు ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జిల్లాను పరిశీలించేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. జిల్లాలోని కార్యక్రమాలు డాక్యుమెంట్ చేసి పంపాలని ఐఏఎస్ అకాడమీ కోరిందని కేటీఆర్ వివరించారు.
కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్