పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)లో పనిచేస్తున్న పలువురు పైలట్లకు నకిలీ డిగ్రీలు ఉన్నట్టు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల పాక్ విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒమన్ కూడా అదేబాటలో నడిచింది. పాకిస్థాన్ విమానాల రాకపోకలపై ఒమన్ నిషేధం విధించింది. తమ గగనతలాన్ని పాక్ విమానాలు వాడుకోకుండా అడ్డుకట్ట వేసింది. ఒమన్ పౌరవిమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత పీఐఏలోని పైలట్లలో దాదాపు మూడోవంతు మంది వద్ద ఉన్న డిగ్రీలు నకిలీవని తేలడం అప్పట్లో సంచలనమైంది. పీఐఏతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయమై ఒమన్ పౌరవిమానయాన శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.