telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బంగ్లా ప్రతిపక్షనేతకు .. మూడేళ్ళజైలు..

gaisuddin 3 yrs jailed

బంగ్లాదేశ్ చిట్టగాంగ్ కోర్టు ప్రతిపక్ష పార్టీ నాయకుడు గైసుద్దీన్ ఖాదర్ చౌదరికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. గత ఏడాది మే 29వతేదీన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిన గైసుద్దీన్ ఖాదర్ చౌదరి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేఖ్ హసీనాను చంపేస్తానని బెదిరించారు. ఈ బెదిరింపు వ్యాఖ్యలపై అధికార ఆవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి నిజాముద్దీన్ ముహురీ కోర్టులో కేసు వేశారు. దీనిపై గత ఏడాది మే 31వతేదీన గైసుద్దీన్ అరెస్టుకు వారంట్ జారీ చేసింది.

సాక్షాత్తూ ప్రధానమంత్రి హసీనాను చంపేస్తానని బెదిరించిన గైసుద్దీన్ కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు ఐదువేల బంగ్లాదేశీ టాకాలను జరిమానాగా చెల్లించాలని చిట్టగాంగ్ కోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు జడ్జి తీర్పు చెప్పారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీర్ దాస్ గుప్తా చెప్పారు.

Related posts