telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కెసిఆర్

టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా ఆయన హైదరాబాద్ ప్రజలకు శుభ వార్త చెప్పారు. “దేశంలోనే గొప్ప చరిత్ర గలిగిన నగరం హైద్రాబాద్. నిజమైన కాస్మోపాలిటన్ సిటీ మనది. అన్ని రాష్ట్రాల, దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. జంట నగరాల్లో నేడు మంచినీటి కొట్లాటలు లేవు. మిషన్ భగీరథ తో నీటి కోసం వీధి పోరాటాలు పోయాయి. ఐటి లో ప్రపంచ ప్రశంసలు పొందుతున్నాం. హైద్రాబాద్ ను మరింత ముందుకు తీసుకువెళ్లేలా టిఆర్ఎస్ ఎజెండా తయారు చేసాం. జిహెచ్ఎంసికి సమగ్ర చట్టం తెస్తాం. మిషన్ భగీరథ తర్వాత 24గంటలు మంచినీటి సరఫరా చేస్తాం. జంట నగరాల్లో డిసెంబర్ నుంచి నీటి బిల్లులు ఉండవు. 20వేల లేటర్లు ఉపయోగించుకునే వారికి ఉచిత నీటి సరఫరా చేస్తాం. దాని వల్ల 97శాతం ప్రజలకు ప్రయోజనం. నాలుగు మసాల తర్వాత రాష్ట్ర వ్యాప్త మున్సిపాలిటీల్లో కూడా ఉచిత నీటిసరఫారాకు చర్యలు. ఢిల్లీ లో ప్రస్తుతం ఇది అమలులో ఉంది. మన రాష్ట్రం రెండోది..రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల కటింగ్ సెలూన్ లకు డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్.. రజకుల లాండ్రీ, దోబీ ఘాట్ లకు కూడా ఉచిత విద్యుత్… హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు 6మాసాల విద్యుత్ చార్జీ రద్దు..మోటార్ వాహనాలు,టాక్సీ లు, క్యాబ్ లకు రెండు త్రైమాసికాల టాక్సీ రద్దు చేస్తున్నాం. చిత్ర పరిశ్రమలో 40వేల మంది పనిచేస్తున్నారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేస్తాం. సినిమా హాళ్లకు తిరిగి ప్రారంభం అయ్యే వరకు విద్యుత్ చార్జీలు రద్దు. సినీమా హాళ్లు తెరుచుకోవడానికి ఈ రోజే జీవో ఇస్తాం” అంటూ సీఎం కెసిఆర్ వరాల వర్షం కురిపించారు.

Related posts