telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసైనికుడు చక్రి మరణ వార్త కలచివేసింది: పవన్

pawan

కృష్ణా జిల్లా జనసేన కార్యకర్త బొమ్మదేవర చక్రి ఈ ఉదయం కొండపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్థ జనసైనికుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు.

చక్రి మరణించారన్నా వార్త కలచివేసిందని తెలిపారు. బాధాతప్త హృదయంతో చక్రికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.

Related posts