లాక్ డౌన్ లో సినిమా షూటింగ్స్ బంద్ కాడంతో హీరో, హీరోయిన్స్ అందరూ రకరకాల ఛాలెంజ్స్ చేస్తూ వచ్చారు. అయితే అందులో ‘ఆర్ఎక్స్ 100’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. అయితే పాయల్ అందాలే ఆర్ఎక్స్ 100 సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయనటంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఆ సినిమా తర్వాత సరైన హిట్ లేక పంజాబీ భామ పాయల్.. తరుచు అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తోంది. లాక్ డౌన్ లో పిలో ఛాలెంజ్ తో యువతకు పిచ్చి ఎక్కించిన పాయల్ తాజాగా టోపీతో షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఇటీవల కొంత బరువు తగ్గి.. నాజూగ్గా మారిన ఈ హాట్ బ్యూటీ ఫోటో షూట్స్ తో కుర్రకారులో సెగలు రేపుతోంది. ప్రస్తుతం పాయల్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. స్పెషల్ సాంగ్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోస్తుంది. కాగా, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం షూటింగ్స్ జరుగుతుండటంతో పాయల్ అందులో బిజీ అయిపోయింది.
previous post
next post