telugu navyamedia
సినిమా వార్తలు

‘మేనిఫెస్టో’ విడుదల చేసిన మంచు విష్ణు

‘మా’ తమ ప్యానల్‌ని గెలిపిస్తే.. ఒక యాప్ క్రియేట్ చెసి దాని సహకారంతో నటులందరికి అవకాశాలు ఇప్పించడంతో పాటు రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడిన అర్హులైన ఆర్టిస్ట్‌లకు సొంత ఇల్లు కట్టిస్తామని ‘ మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు గురువారం తన ఫ్యానల్‌కు సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేశారు.

మంచు విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
*ఒక యాప్ క్రియేట్ చెసి దాని సహకారంతో అందరికి అవకాశాలు ఇప్పిస్తాం
*అర్హులైన సభ్యులకు సొంత ఇళ్లు
* మా సభ్యుల పిల్లల విద్యకు ఆర్థిక చేయూత
* సొంత డబ్బులతో ‘మా’భవనం
*ప్రతీ ఒక్కరికి ఫ్రీ హెల్త్
*మహిళల రక్షణకి హై పవర్ కమిటీ
*‘మా’సభ్యుల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్‌
*కల్యాణలక్ష్మీ తరహాలో రూ.1.16 లక్షలు
*అర్హులైన సభ్యులకు పెన్షన్లు
*‘మా’సభ్యత్వ ఫీజు రూ.75 వేలకు తగ్గింపు
*‘మా’సభ్యుల కోసం జాబ్‌ కమిటీ ఏర్పాటు

Related posts