telugu navyamedia
సినిమా వార్తలు

అబ్బాయిలు కూడా పెళ్ళి చేసుకోమంటున్నారు… నటుడి ఆవేదన

Arjun

కొన్నిసార్లు నటీనటులకు తెర మీద తాము చేసే పాత్రలు నటీనటులకు రియల్‌ లైఫ్‌లోనూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఓ బాలీవుడ్ హీరోకు విచిత్రమైన సమస్య ఎదురైంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్ సినిమాతో రాహుల్ పాత్రలో నటించిన నటుడు అర్జున్‌ మాథుర్‌. ఈ సినిమాతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించిన అర్జున్‌కు ఇప్పుడు ఆ వెబ్‌ సిరీస్‌ కారణంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయట. “మేడ్‌ ఇన్‌ హెవెన్‌” పేరుతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో అర్జున్‌ గే పాత్రలో నటించాడు. దీంతో ఇప్పుడు అర్జున్‌కు అబ్బాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయట. అంతేకాదు కొంత మంది అబ్బాయిలు అభ్యంతరకర సందేశాలు కూడా పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అర్జున్ మథుర్‌.

Related posts