telugu navyamedia
ఆరోగ్యం

ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్…

ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్ సిఫార్సు చేసింది. మలేరియా.. దోమల కారణంగా విస్తరించే ఈ రోగం బారిన పడి ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి మలేరియాతో మరణిస్తున్నట్లు WHO ట్వీట్ చేసింది.  మలేరియాను నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

 “ఈ రోజు, WHO ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ యొక్క విస్తృత ఉపయోగాన్ని సిఫార్సు చేస్తోంది” అని ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు.

2025 నాటికి ప్రపంచం నుంచి మలేరియాను నిర్మూలించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం WHO తీవ్రంగా పని చేస్తోంది. 25 దేశాలలో నిర్మూలన కార్యక్రమం కూడా ప్రారంభించింది. దోమల ద్వారా సంక్రమించే మలేరియా ప్రతి సంవత్సరం వందల మందిని చంపుతుంది. 

ఈ క్ర‌మంలోనే ప్రజలను పట్టి పీడుస్తున్న ఈ మహమ్మారి నిర్మూలనకై ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సారిగా పిల్లల కోసం వ్యాక్సిన్ సిఫార్సు చేసింది. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేసింది. అధిక మలేరియా వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పిల్లల మరణాలను తగ్గించడానికి WTS RTS మలేరియా వ్యాక్సిన్‌ను సిఫార్సు చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను ఉప-సహారా ఆఫ్రికాలో ఉన్న పిల్లలలో విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించింది.

మలేరియా వ్యాప్తి ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా ఉంది. మలేరియాతో ప్రతి సంవత్సరం దాదాపు 260,000 ఆఫ్రికన్ పిల్లలు మరణిస్తున్నారు. మలేరియాను నివారించడానికి ఇప్పటికే ఉన్న పరికరాల పైన ఈ మలేరియా వ్యాక్సిన్‌ను ఉపయోగించడం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది యువకుల ప్రాణాలను కాపాడవచ్చని టెడ్రోస్  చెప్పారు.

TS, S / AS01 మలేరియా వ్యాక్సిన్..
WHO ద్వారా ఉపయోగం కోసం ఆమోదించబడిన టీకా శాస్త్రీయ నామం RTS, S / AS01. WHO సంస్థ రెండు అతిపెద్ద సలహా సంస్థల ఆధారంగా సిఫార్సు చేసింది. 5 నెలల పైబడిన పిల్లలకు ఈ టీకాను ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. పిల్లలకు మొత్తం నాలుగు మోతాదులు ఉంటాయి. ఇప్పటివరకు, మూడు ఆఫ్రికన్ దేశాలలో 2.3 మిలియన్ డోసుల టీకా ఇచ్చారు. ఈ టీకా పూర్తిగా సురక్షితం అని నిరూపించారు.

Related posts