చాలా మందికి ఆహారం కొంచం తిన్నా కూడా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ.. వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నిటికీ కారణం జీర్ణాశయ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోవడం వలెనే అంటున్నారు నిపుణులు. అయితే ప్రస్తుత తరుణంలో చాలా మంది ఈ సమస్యలతో సతమతం అవుతున్నారు. అలాంటి వారు కింద చెప్పిన ఆహారాలను నిత్యం తీసుకుంటే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి జీర్ణసమస్యలు తగ్గాలంటే అందుకు నిత్యం ఏయే ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం..!
* జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన గుణాలు పెరుగులో ఉంటాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా పోయి మంచి బాక్టీరియా వృద్ధి చెందాలంటే రోజూ పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనితో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉండవు.
* ముడి బియ్యం, ఓట్స్, గోధుమలు తదితర తృణ ధాన్యాల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. అజీర్ణం సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.
* రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదనే విషయం తెలిసిందే. అలాగే రోజూ తినాల్సిన ఆహారాల్లో అరటి పండు కూడా ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణసమస్యలను దూరం చేస్తాయి. గ్యాస్, అసిడిటీ ఉండవు. మలబద్దకం పోతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
* నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటుంటే జీర్ణ సమస్యలు ఉండవు. వికారం, మార్నింగ్ సిక్‌నెస్, అజీర్ణం వంటి సమస్యలకు అల్లం పవర్‌ఫుల్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. డైరెక్ట్‌గా అల్లం రసం తీసుకోలేం అనుకునేవారు అల్లాన్ని రోజూ మూడు విడతలుగా ఆహారంలో ఒకటి, రెండు గ్రాముల చొప్పున తీసుకున్నా చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
* కీరదోసలో కాల్షియం, ఫోలేట్, విటమిన్ సి, ఎరెప్సిన్ అనే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను పోగొట్టడం, శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాదు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం తదితర సమస్యల నుంచి బయట పడేస్తాయి.
పవన్ పొలిటికల్ జర్నీపై నిహారిక ఆసక్తికర కామెంట్స్…