నెవార్క్‌కు చెందిన జానియా పీ స్టీవెన్స్(23) అనే యువతికి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో సదరు వ్యక్తి ఆమెను తన ఫ్లాట్‌కు ఆహ్వానించాడు. దాంతో ఆ వ్యక్తి ఫ్లాట్‌కు వెళ్లిన జానియా ఓ విషయమై అతడితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో అతన్ని కత్తితో మూడుసార్లు పొడిచి అక్కడి నుంచి వచ్చేసింది. దాంతో బాధితుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు స్టీవెన్స్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, పోలీసుల విచారణలో తన గొంతు నులిమేందుకు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం అతన్ని పొడిచినట్లు చెప్పింది. కానీ, పోలీసులకు ఆమె మెడపై అలాంటి గుర్తులేమి కనిపించలేదు. దాంతో స్టీవెన్స్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
previous post
సీఎం జగన్ ఫ్యాక్షన్ నేతగా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల