telugu navyamedia
ఆరోగ్యం

ప్రజానీకాన్ని దడపుట్టిస్తున్న ఒమిక్రాన్..

కంటికి కనబడని శత్రువు ప్రపంచాన్ని వణికించింది. అన్నిరంగాలపై ప్రభావం చూపింది. ప్రపంచదేశాలను స్తంభింపజేసింది. వైద్య శాస్త్రరంగానికి సవాలు విసిరింది. సమున్నతమైన వైరస్ ను వ్యాక్సిన్ ఎదుర్కోగలదని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ప్రపంచదేశాలు వ్యాక్సిన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాయి. తాజాగా కోవిడ్ కంటే.. ప్రమాదకమైందని కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. ఇపుడు తాజాగా ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. కరోనా కు చంపే గుణం పోయింది . భయమే చంపుతోంది. అది ఓమిక్రాన్ రూపం లో… కాకపోతే గుండెపోటు రూపం లో .. ఇంతకీ ఈ ఒమిక్రాన్ ఎంతవరకు భయపెడుతుంది. ప్రజానీకాన్ని ఏవిధంగా ముప్పుతిప్పలు పెడుతుందో చూద్ధాం…

ఇప్పటిదాకా కరోనా రెండు దశల్లో విస్తరించింది. మానవ ప్రాణాలను బలిగొంది. మానవసంబంధాలకు విలువలేకుండా చేసింది. మూడోదశ విస్తరిస్తుందనుకున్నారు. ఆనవాళ్లే లేదని కొందరు… విస్తరిస్తోందని మరికొందరు ప్రస్తావనకు తెచ్చారు. తాజాగా ఇదో కొత్త రకం కరోనా ఆనవాళ్లు ఆందోళనకు గురిచేస్తోంది. ఇది మన దేశం లో రెండో వేవ్ , మార్చ్ – మే 2021 కి కారణం అయిన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం గా విస్తరిస్తుంది . డెల్టా వేరియంట్ మార్చిలో మన దేశం తో మొదలై అక్టోబర్ నాటికి ప్రపంచం లోని అన్ని దేశాలను చుట్టేసింది . డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం అంటే ఓమిక్రాన్ ను నిలువరించడం అసాధ్యం . కట్టడి చర్యలు అనేది వినడానికి బాగుంటాయి . వాస్తవంగా, అందునా జనాభా ఎక్కువ ఉన్న భారత దేశం లో అసాధ్యం .

ఓమిక్రాన్ దక్షిణాఫ్రికా దేశం లో ముందుగా గుర్తించారు . ఆస్ట్రేలియా , ఇటలీ , జర్మనీ , నెథర్లాండ్ , బ్రిటన్ , ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్ , బోట్స్వానా , బెల్జియం దేశాల్లో ఇది ఇప్పటికే వుంది .

ఓమిక్రాన్ సోకిన వారు కనబరిచే లక్షణాలు : 1 బాగా అలసట గా ఉండడం , కొద్ది పాటి కండరాల నొప్పి , గొంతులో కొద్ది పాటి గరగర , పొడి దగ్గు . తక్కువ మందిలో కొద్ది పాటి జ్వరం . చికెన్ గున్యా కు దీనికి చాలా మాటకు ఒకటే లక్షణాలు .

ఎవరికి సోకుతుంది ?

మొదటి వేవ్ లో కరోనా బారిన పడిన వారికి సోకవచ్చు . వారి ఇమ్మ్యూనిటి బాగా దెబ్బ తినే ఉంటే తప్పించి వారి పై దీని ప్రభావము అత్యంత స్వల్పం . అసలు వచ్చినట్టే తెలియదు . ఇప్పటిదాకా కరోనా సోకకుండా , వాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న వారికి సోక వచ్చు . రెండు రోజులు అలసట , పొడి దగ్గు , 101 డిగ్రీలు దాటని జ్వరం తో ఇది పోతుంది . ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు . రెండో వేవ్ లో డెల్టా సోకిన వారికి ఇది సోకే అవకాశం బాగా తక్కువ తక్కువ . సోకినా వారికే అర్థం కాకుండా అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా పోతుంది . ఇప్పటిదాకా కరోనా బారిన పడకుండా అంతే కాకుండా వాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారికి ఇది సోకుతుంది . వారి ఇమ్మ్యూనిటి బాగుంటే కోలుకొంటారు .

ఎవరికి ప్రమాదకరం?

భయపడే వార్తలను పదేపదే చదివే వారికి, వినేవారికి డేంజర్ . వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది . ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది . అటుపై దాని కంటే అనేక రెట్ల వేగం తో విస్తరించే డెల్టా వచ్చింది . ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్ . కట్టడి చర్యల పేరుతొ మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి . కరోనా ను నుంచి ముక్కున్న మానవుడు తప్పించుకోలేడు అని నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను . కరోనా పోతుంది అని ఇంకా నమ్మే అమాయక ప్రజలు కోకొల్లలుగా వున్నారు . కరోనా ఎక్కడికీ పోదు . మరో వంద ఏళ్ళైనా ఉంటుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మన మధ్యే వుంది . అది సాధారణ జలుబు కలుగ చేస్తుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం . కానీ మ్యుటేషన్ లు జరిగే కొద్దీ బలహీన పడి జలుబు ఫ్లూ వైరస్ గా నిలిచిపోయింది . కరోనా కూడా అంతే .. ఒళ్ళు నొప్పుల వైరస్ గానో మరో స్వల్ప లక్షణాలు కలుగచేసే వైరస్ గా నో స్థిరపడి పోతుంది . మీ జీవిత కాలం లో ఎన్నో సార్లు సోకుతుంది . సోకినా ఏమీ కాదు . భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు .

ఓమిక్రాన్ కు మోనోక్లోనల్ యాంటీబోడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ . విపరీతంగా భయపడే వారు , లేదా ఇమ్మ్యూనిటీ మరీ బలహీనంగా ఉన్న వారు తప్పించి మిగతా వారికి దీని అవసరం రాదు .

మ్యుటేషన్ ల కు గురికావడం సూక్షజీవుల లక్షణం . ఆ మాటకు వస్తే అన్ని జీవులు . కాకపోతే సూక్షజీవుల పై ప్రభావం ఎక్కువ . ఓమిక్రాన్ రేపు మరో రూపం లో కి మారొచ్చు . దాన్ని ఆపలేము . దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు . మన ఇమ్మ్యూనిటి నే మనకు రక్ష. ప్రతి రోజు కనీసం అరగంట ఎండ లో నడవండి . శరీరానికి డి విటమిన్ అందివ్వండి . శాఖాహారులు బి 12 విటమిన్ మాత్రలు తీసుకోండి . తినే ఆహారం లో ప్రోటీన్ లు ఎక్కువగా ,కనీసం ముప్పై శాతం ఉండేలా చూసుకోండి . పన్నీర్ , మొలికెత్తిన పెసలు , పుట్టగొడుగులు , బ్రోకలీ , జామ కాయ , చికెన్ , ఫిష్ మటన్ , గుడ్డు ప్రోటీన్ అందించే ఆహార పదార్తాలు . రోజుకు పెద్దలు నాలుగు లీటర్ల నీరు తాగాలి . చెమట పట్టేదాకా వ్యాయామం,కనీసం నడక ,చెయ్యాలి . శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి . నిద్ర బాగా పోవాలి . ఇవన్నీ ఇమ్మ్యూనిటి ని బలపరుచుకొనే మార్గాలు .

అన్నింటికన్నా భయం పెద్ద విలన్ .. భయం ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది . అదే ఫార్మసురుల అస్రం. భయం తో మళ్ళీ మీ ఆస్తులు ఖాళీ చేసి వారి గోదాముల్లో నోట్ల కట్టలు సంచుల్లో దాచుకొనే అవకాశాన్ని కల్పించుకొంటున్నారు . తస్మాత్ జాగ్రత్త . వేవ్ అంటే ఆసుపత్రిల్లో బెడ్ లు దొరకపోవడం , అంబులెన్సు ల క్యూలు .. ఇలాంటి స్థితి రాదు . కానీ మన దేశం లో కరోనా అంటే భయపడే వారు కోకొల్లలుగా వున్నారు . ఇన్నాళ్లయినా నిజాన్ని గ్రహించలేని వారు , భయం వద్దని చెబితే మొండిగా, మూర్ఖంగా వాదించేవారు వున్నారు . వారిని ఓమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు . తత్త్వం బోధపడేటప్పటికీ వారు ఉండక పోవచ్చు .. ఉన్నా ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యం తో .. ఇలా చెబుతున్నందుకు సారీ . నిజం నిష్టూరంగా ఉంటుంది . తప్పదు .

భయాన్ని బహిష్కరించండి . నిర్భయంగా వుండండి . అప్రమత్తత అవసరం . అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒక సారి చెక్ చేసుకోండి . అది 94 పైగా ఉంటే హ్యాపీగా గా కాలం గడపండి .

Related posts