telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఫ్రిడ్జ్ లో .. ఇవి పెట్టారో.. ఇక అంతే.. జాగర్త!!

ఎండాకాలం వచ్చిందంటే, సుఖానికి అలవాటుపడ్డ ప్రాణానికి గుర్తొచ్చేది.. ఫ్రిడ్జ్. ఏదోటి తెచ్చి దానిలో పడేసి, చల్లగా అయ్యాక లోనికి పుచ్చుకోవటం.. చాలా మంది చేసే సర్వసాధారణ పని. కానీ అది ఎంతో ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. కొన్ని శీతల వాతావరణంలో ఉంచడం వలన వాటిని మరికొంత కాలం నిల్వ చేసుకోవచ్చు.. అలాగే మరికొన్నిటిని నిల్వ చేయరాదు. కానీ, వాటిని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని.. రోజులు గడిపేస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో చాలా పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటివి తినడం కంటే, తినకపోవడమే చాలా మేలు అంటున్నారు వారు. ఇక వేసవి లో చాలా మంది కి ఫ్రిడ్జ్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది.

మన ఆహార పదార్థాలను , కూరగాయలని మరియు నీళ్లు పాలు పెరుగు వంటివి చెడిపోకుండా ఉండేందుకు చల్లబడేందుకు ఫ్రిడ్జ్ లో పెడతాం. కొన్ని కూరగాయలు, ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు, వాటి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. అవేంటో తెలుసుకుందాం..!

watermelon uses for health in summer* పుచ్చకాయ : వేసవిలో చాలా వరకు చల్లగా ఉండేందుకు పుచ్చ కాయలు తింటాం, తినాలి కూడా, ఎందుకంటే అది ఈ సీజన్ లో లభించేది, దానిని తిని తీరాలి. వేసవి తాపానికి అది శరీరానికి చాలా మేలు చేస్తుంది. అలా అని, బయటకి వెళ్ళినపుడు రెండు మూడు తీసుకువచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాం. పుచ్చకాయలని కొస్తే వాటిని ఒక బాక్స్ లేదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి. అలాగే కోయని పుచ్చకాయలు ఉంటే చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

* ఉల్లిపాయ : మనం వంటకి సరిపోయే దానికన్నా ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం ద్వారా వాటిని మళ్ళీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతాం దానివల్ల తరిగిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది, తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండడమే మంచిది.

* బంగాళదుంప : వీటిని చల్లటి ప్రదేశం లో లేదా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులో చక్కెర శాతం ఎక్కువగా పెడుగుతుంది. దీనివల్ల కూర లో రుచి అనేది మారుతుంది. వీటిని వంటరూమ్ లొనే ఉంచుకోవడం ఉత్తమం. కొందరు వీటి ముక్కలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి, మళ్ళీ వాడుకుందాం అనుకుంటారు.. అలా చేయరాదు.

* తేనె : ఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం తేనె, దీనిని ఫ్రిడ్జ్ లో అసలు ఉంచకండి దానివల్ల తేనె యొక్క రుచి మారుతుంది. తేనె ని అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశం లో పెట్టుకోవాలి.

over fridge usage is no more healthy* అరటి పండ్లు : ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి. దీనితో అరటి పండ్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అరటి పండ్ల ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. కూర అరటి అయితే బాక్స్ లో పెట్టి నిల్వచేసుకోవాలి. అది కూడా రెండు రోజుల కంటే ఉంచడం శ్రేష్టం కాదు.

* పువ్వులు : పువ్వులని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది, ఆ పుల వాసనతో ఇతర ఆహారాలని మనం తినలేం. ఎయిర్ టైటెన్ బాక్స్ లలో పెట్టుకుంటే పరవాలేదు.

* పచ్చళ్ళు : కాలానికి తగ్గట్లు తెలుగు వారు పచ్చళ్ళు పెడతారు. ఇవి చెడిపోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు పెట్టడం ద్వారా ఆ చల్లదనాన్ని ఉరగాయలు త్వరగా చెడిపోతుంది. ఈ పచ్చడి విధానం ఎప్పటి నుండో దేశంలో ఉంది. మరి పాతకాలంలో ఈ ఫ్రిడ్జ్ గట్రా లేనప్పుడు ఎలా ఉన్నాయో.. అలాగే పింగాణీ జాడీలలో/పాత్రలలో ఉంచాలి, కానీ ఫ్రిడ్జ్ లో పెట్టరాదు.

* బ్రెడ్ : మనం బ్రెడ్ పాకెట్ ఓపెన్ చేశాక మిగిలిపోయినది ఫ్రిడ్జ్ లో పెడితం దీనివల్ల బ్రెడ్ గట్టి పడి తినలేని స్థితికి వస్తాయి అందువల్ల కవర్ మూసి పెట్టాలి.

cold season health issues and remedies** ఏది ఏమైనా ఇటీవల యాడ్స్ లో కూడా నెలపైనే ఫ్రిడ్జ్ లో ఏవైనా నిల్వ చేసుకోవచ్చు.. అని చెపుతున్నారు. అది కుదరని పని.. వాళ్ళు చెప్పింది అన్ని సరిగ్గా ఉన్న పరిస్థితులలో.. అంటే అవి సేంద్రియ వ్యవసాయం చేసి పండించినవై ఉండాలి, వాటిపై దుమ్ముదూళి లేకుండా చక్కగా శుభ్రం చేసినవై ఉండాలి(పాలను ప్యాకింగ్ చేసేందుకు ప్రాసెస్ చేస్తుంటారు కదా.. అలా చేయాలి).. అప్పుడు కూడా వాటి జీవన ప్రమాణం మహా అయితే వారం. కానీ మనం రోజు తినేవి నెలలుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని… సమయం లేదని.. అవే తింటున్నాం. అలా తింటే, స్లో గా విషం శరీరానికి అందించినట్టే అంటున్నారు నిపుణులు. ఇది భవిష్యత్తులో క్యాన్సర్ వంటివాటికి దారితీసే ప్రధాన కారణం అవుతుంది. అందుకే, ఎప్పటిది అప్పుడు స్వయంగా వెళ్లి కొన్నుకొన్ని, వంట చేసుకొని తినడం శ్రేష్టం. ఇంకా ఆరోగ్యాంగా ఉండాలంటే, ఇంటిపై చిన్న గార్డెన్ ఏర్పాటు చేసుకొంటే, అంతకంటే మేలు ఇంకోటి ఉండదు. గార్డెనింగ్ వలన శారీరక వ్యాయామం-ఆరోగ్యానికి ఆరోగ్యం. రెండు దక్కుతాయి; కొసరు అన్నట్టుగా, వంట వండే ముందే కావాల్సినవి కొనుక్కొని తినవచ్చు. అనవసర సుఖానికి పోయి, బద్దకస్తులై, మెషిన్ లను నమ్ముకొని, రోగగ్రస్తులుగా మిగిలిపోకండి. మన ఆరోగ్యం-మన చేతిలోనే ఉంది.

Related posts