telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాళ్ళను చూసి ఆడవాళ్లు చెడిపోతున్నారు : శ్రీరెడ్డి

Srireddy

ఓ వైపు కరోనా వచ్చి ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే శ్రీరెడ్డి మాత్రం శ్రీరంగ నీతులు చెబుతుంది. తాజాగా ఫేస్ బుక్‌లో ఈమె చేసిన పోస్టులు ఎవరికీ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. మీకు బాగా నచ్చిన వాళ్లు.. మీరు ఇష్టపడే వాళ్లకు మీకు కానీ విలువ ఇవ్వలేదంటే వదిలేయండి.. వాళ్ల ప్రేమలో స్వార్థం ఉంది.. వాళ్లు విషంతో సమానం.. వాళ్ళతో ఉంటే మీ ఉనికి మీరు కోల్పోతారంటూ సూక్తులు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు నిజ జీవితంలో హీరోయిన్లను అస్సలు ఇన్స్పిరేషన్‌గా తీసుకోవద్దని చెబుతుంది. ఎందుకంటే వాళ్లదంతా నటన అని చెబుతుంది. వాళ్లంతా డబ్బున్న వాళ్లను.. అందగాళ్లను మాత్రమే పెళ్లి చేసుకుంటారు.. కానీ నిజ జీవితంలో వాళ్లు నటించిన సినిమాలను చూపించడానికి.. ఆ సినిమాలకు టిక్కెట్స్ కొనడానికి మాత్రం కావాల్సింది పేద అబ్బాయిలే అంటూ సపోర్ట్ చేసింది ఈమె. కేవలం సినిమా హీరోయిన్‌ల వల్లే ఈ రోజు చాలా మంది ఆడవాళ్లు చెడిపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. 

Related posts