telugu navyamedia
సినిమా వార్తలు

‘అన్నాత్తే’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

వినాయక చవితి సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు టీమ్. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ ను దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న రిలీజ్ చేయనున్నారు.

Rajinikanth's Annaatthe first look and motion poster to be out on September  10 - Movies News

ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అన్నాత్తే’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ పోస్టర్లో తలైవా
పంచె కట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకొని , ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ గా నిలుచొని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇందులో రజినీకాంత్ ఏదో సాంగ్ లో సెలబ్రేషన్స్ లో పోస్టర్ లా ఉంది.

Rajinikanth's 'Annaatthe' first look poster to arrive on September 10th 11  AM | Tamil Movie News - Times of India

ఈరోజు సాయంత్రం 6 గంటలకు ‘అన్నాత్తే’ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేయనున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తుంది. కమెడియన్లు సూర్య, సతీష్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు..

Related posts