నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేశ్ తదితరులు
దర్శకుడు: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
సంగీత దర్శకుడు: తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా వినాయక చవితి కానుకగా ఈ రోజు (సెప్టెంబర్ 10న) విడుదలైంది.
కొద్ది రోజులుగా అందరి నోటా ఒకటే నానుడి. హీరో నాని ఓ.టి.టి ఎందుకు ఎన్ను కున్నాడు? టక్ జగదీష్ కూడా ఓ.టి.టిలోనే చూడాలా? ఒక అభిమానిగా నేను ఆలోచించాను. కానీ..సినిమా చూశాకా అర్థమైంది. నాని మంచి పనే చేశాడు. థియేటర్‌లో చూసి అద్భుతం అనే చిత్రమైతే కాదు…
కథ..
ముఖ్య కథ విషయానికొస్తే అన్న, నాన్న, ఓ తమ్ముడు మధ్యలో ఒక చెడ్డవాడు. నాన్న మాటని జవదాటని కొడుకు. కుటుంబం కోసం నిలబడిన అదే కొడుకు.
జగదీష్ (నాని) భూదేవిపురం అనే గ్రామానికి పెద్దగా ఉన్న ఆదిశేషయ్య నాయుడికి(నాజర్ ) రెండో భార్య చిన్న కొడుకు. అతను.. తన అన్నయ్య బోస్ (జగపతిబాబు).. తమ సవతి తల్లి కూతుళ్లతో సంతోషంగా కలిసి ఉంటారు.
ఆ ఊరిలో భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. భూపతి కుటుంబంలోని వీరేంద్ర (డేనియల్ బాలాజీ) అందుకు ప్రధాన కారణం. వీటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే శేషగిరి నాయుడు హఠాత్తుగా చనిపోతాడు. ఆ తర్వాత బోస్, వీరేంద్రతో చేతులు కలపడంతో పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోతాయి. కుటుంబమంతా విడిపోతుంది.
తన తదనంతరం కూడా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలన్నది ఆదిశేషయ్య కోరిక. కానీ ఆయన మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. కుటుంబంలో విబేధాలు తలెత్తి చెల్లాచెదురు అవుతుంది. ఈ సమయంలో ఎం.ఆర్.ఓ గా ఎంట్రీ ఇచ్చిన టక్ జగదీష్ పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కలిపాడు? అనేదే మిగతా కథ.
మొత్తానికి ఫస్ట్ హాఫ్ అంతా చక్కని కుటుంబ భావోద్వేగాలతో నడిచింది. ప్రీ-ఇంటర్వెల్ సమయంలో తీసుకొచ్చిన ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ తరువాత బాగుంది అని అనిపించుకున్నా బిజియమ్ దెబ్బతీసింది. యావరేజ్ మ్యూజిక్, ఫైట్స్ మాత్రం అదరగొట్టాడు హీరో నాని. కథ రోటీన్‌గా ఉన్నా.. పంగడ కదా, ఇంట్లో అందరు కలిసి సరదాగా చూడదగ్గ సినిమా.
ఈ సినిమా మొత్తంలో నాని తన పాత్రను ఎప్పటి లాగా దుమ్ము దులిపేశాడు. కథ ఎలాంటిదైనా తన వంతుగా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో తన లుక్, యాక్టింగ్ అన్ని కూడా మునపటి కంటే మరింతగా ఆకట్టుకున్నాయి. జగపతిబాబు, డేనియల్ బాలాజీ పరవాలేదు అనిపించినా.. గుమ్మడి వరలక్ష్మిగా రీతువర్మ మెప్పించలేకపోయింది. శివ నిర్వాణ కొత్తగా తీసిన నాకు ఎందుకో కార్తిక్ నటించిన చినబాబు సినిమా గుర్తొచ్చింది.
నెక్ట్స్
మళ్ళీ వారసుడోచ్చాడు..
మీకేం పోయేకాలం… బాహుబలి తరువాతే కదరా మీరిద్దరూ… హీరోలపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు