telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగచైతన్య నెక్స్ట్ టైటిల్ ఇదే..?

Akkineni

‘మజిలీ’, ‘వెంకీమామ’తో మంచి హిట్లు అందుకున్ననాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చేస్తున్నాడు. అయితే దీని తరువాత చైతన్య మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో నటించాల్సి ఉంది. అయితే పరశురామ్ మహేశ్ బాబు ప్రాజెక్ట్‌తో బిజీ అవటంతో చైతన్య మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వీటిలో ఒకటి సమంతకి ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ అందించిన నందిని రెడ్డితో ఓ మూవీ కాగా, మరోటి అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన విక్రమ్ కుమార్ తో దిల్ రాజు నిర్మించే మరో సినిమా. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి ‘థాంక్యూ’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Related posts