telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్”లో బూతులు… : రామ్

Ismart-Shnkar

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్‌ శంకర్‌”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు ముస్తాబయింది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో బూతులు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఈ విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ సినిమాలో పాత్రను బట్టి లాంగ్వేజ్ ఉంటుందని, అలానే శంకర్ పాత్రను బట్టి డైలాగ్స్ ఉంటాయే తప్ప కావాలని పెట్టినవి కావని, సినిమా చూస్తున్న సమయంలో శంకర్ పాత్ర అలాంటిది కాబట్టి పర్వాలేదని అనుకుంటారని తెలిపారు. తల్లితండ్రులు లేకుండా స్లమ్ లో పెరిగిన కుర్రాడు ఇలా మాట్లాడితేనే సహజంగా ఉంటుందని, ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఒక సందర్భంలో ‘నువ్ ఎందుకు ఇలా ఉంటావ్..?’ అని అడుగుతుంది. అప్పుడు శంకర్ చెప్పే సమాధానం చాలా కన్విన్సింగ్ గా ఉంటుందని రామ్ అన్నారు.

Related posts