telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్స్‌ గుడ్‌ న్యూస్‌.. మరో అదిరిపోయే వచ్చేసింది

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది.  మొన్న రాంచరణ్‌ బర్త్‌ డే సందర్భంగా… చరణ్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. తాజాగా అజయ్‌ దేవగణ్‌ లుక్‌కు టైం ఫిక్స్ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం. ఏప్రిల్‌ 2న అజయ్‌ దేవగణ్‌ బర్త్‌డే కావడంతో ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి అజయ్‌ ఫస్ట్‌ లుక్‌తోపాటు మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రం బృందం కాసేపటి క్రితమే ప్రకటించింది. ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో అజయ్‌ను చూడనున్నారని మేకర్స్‌ పేర్కొన్నారు. 

Related posts