telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు… వెల్‌డన్‌ హీరోస్‌ : సోనూసూద్

Sonu-Sood

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఏఓబీలో గల గిరిశిఖర కొదమ పంచాయతీ చింతామలలో సుమారు 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలో భారీ సంత జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లాలన్నా, మరే ఇతర అవసరాల కోసమైనా ఈ పంచాయతీ గిరిజనులు సబకుమరి జంక్షన్‌ దాటాల్సి ఉంటుంది. అయితే జంక్షన్‌ వరకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వేసిన బీటీ రోడ్డు మాత్రమే ఉంది. అయితే దాటేందుకు రోడ్డు వేయాల్సిందిగా దశాబ్దాల తరబడి అర్జీలు పెట్టుకున్నా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో గిరిజనులు తమ సమస్యను తామే తీర్చుకునేందుకు నడుం బిగించారు. సబకుమరి జంక్షన్‌ వరకు రోడ్డు నిర్మాణానికై చింతామల గ్రామస్తులు ఇంటికి రెండు వేల చొప్పున చందాలు సేకరించారు. వాటితో రెండు ప్రొక్లెయిన్లను రప్పించి కొండను తవ్వించి ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్‌ సోనూసూద్‌ దృష్టికి తీసుకువెళ్లగా గిరిజనులపై ప్రశంసలు కురిపించారు. “మీలాంటి ఇంకెంతో మంది వ్యక్తులు ఇలాగే ముందుకు వచ్చి తమ పనులు తామే చక్కబెట్టుకుంటే ఎంతో బాగుంటుంది. ఇలాంటివి మరిన్ని చూడాలని ఉంది. త్వరలోనే అక్కడికి వస్తాను. మిమ్మల్ని కలుస్తాను. మీరు జాతి మొత్తానికి స్ఫూర్తిగా నిలిచారు. వెల్‌డన్‌ హీరోస్‌’ ’అంటూ ట్విటర్‌ వేదికగా కొనియాడారు.

Related posts