telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “ప్రేమకథా చిత్రం-2” లిరికల్ వీడియో

prema kadha chitram 2

2013లో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన “ప్రేమకథా చిత్రం” సినిమాకు సీక్వెల్ గా “ప్రేమకథా చిత్రం-2” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా జంటగా నటిస్తున్నారు. సిద్ధి ఇద్నాని ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. హరికిషన్ అనే దర్శకుడు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “మెరుపులా మెరిసిన చిరునవ్వా .. చినుకులా మనసును తడిపేయవా… ” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. రాహుల్ – రమ్య బెహ్రా ఆలాపన, జీవన్ బాబు సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం ఈ పాటకు బలంగా నిలిచాయి. యూత్ కు ఈ పాట బాగా కనెక్ట్ అవుతుంది.

తాజాగా చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, హిందీ శాటిలైట్, డబ్బింగ్ హక్కులు కోటి నలభై మూడు లక్షలకు అమ్ముడయ్యాయని… సినిమాలో ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలిపారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఇక గతకొంత కాలంగా సుమంత్ అశ్విన్ నటిస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఈ సినిమాతోనైనా మంచి హిట్ ను అందుకోవాలని చూస్తున్నాడు సుమంత్ అశ్విన్. మరి ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.

Related posts