రైల్వే ప్రయాణికులు ఆధార్ ఉంటే నెలలో 12 సార్లు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవచ్చని భారతీయ రైల్వే టూరిజం, కేటరింగ్ సంస్థ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ ఖాతాదారులకు నెలలో 6 సార్లు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. నిత్యం ప్రయాణాలు చేసేవారికి ఆధార్‌తో లబ్ధి చేకూరుతుందని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.
ఆధార్ అనుసంధానం..ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక.. ‘మై అకౌంట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కేవైసీ పేజీలో.. ఆధార్‌కార్డులో పేర్కొన్నట్లు పేరు, ఇతర వివరాలను అందజేయాలి. వెంటనే రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నిర్ణీత కాలమ్‌లో పేర్కొని.. ‘అప్‌డేట్ ఆధార్’పై క్లిక్ చేయాలి. ఐఆర్‌సీటీసీ ఖాతాతో ఆధార్ అనుసంధానమైందా? లేదా? అని తెలుసుకోవడానికి కేవీసీ ఆప్షన్‌లో ‘ఆధార్’ను ఎంచుకోవాలి.
టీడీపీ మొత్తం బీజేపీతో కలిసిపోతుంది..జేసీ సంచలన వ్యాఖ్యలు