telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ !

school teachers class

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. తాజాగా సీబీఎస్ఈ కూడా 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ ను కుదిస్తున్నామని వెల్లడించింది. ఈ నిర్ణయం 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని తెలిపింది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.

Related posts