సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూల్ జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. చరితారెడ్డి భర్త వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి కూడా ఆమెతో పాటు రాజీనామా సమర్పించారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత వీరిద్దరూ ఏపీ డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలవాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ నెల 3న గౌరు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గౌరు దంపతులు కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మారే విషయమై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇటీవలనే వైసీపీలో చేరారు.కాటసాని రాంభూపాల్ రెడ్డికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టును ఇవ్వనున్నట్టు సంకేతాలు రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు వైసీపీకి రాజీనామా సమర్పించారు
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి