బిగ్ బాస్ షో లో జరిగే ఘటనలు రోజురోజుకు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చూసుకుంటే.. ఈ వారంలో బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య పెద్ద రచ్చ జరిగింది. దీనిపై ఇంటి సభ్యులకు నాగ్ స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. ఇంట్లో మోస్ట్ ఎంటర్ టైనింగ్ కంటెస్టెంట్ అయిన బాబా భాస్కర్‌కు నాగార్జున గట్టి క్లాసే ఇచ్చారు. ప్రతి విషయాన్ని కామెడీ చేయడమే అందుకు కారణం.
బాబా భాస్కర్ కాదు.. మాస్కర్ అంటూ పలుమార్లు నాగార్జున చెప్పుకొచ్చాడు. బయటకు వచ్చిన హౌస్‌మేట్స్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు. బాబా తన మాస్క్ తీయలేదని.. సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, అందరి చేత మంచి అనిపించుకోవాలని అనుకుంటున్నాడని బయటికి వచ్చిన వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌లో నాగార్జున బాబా పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. నామినేషన్ విషయంలో ప్రవర్తించిన తీరు, హౌస్‌మేట్స్ వెనకాల మాట్లాడిన విషయాలను ప్లే చేయించి మరీ.. క్లాస్ తీసుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదలైన ఓ ప్రోమో వైరల్ అవుతోంది. అయితే ప్రోమోలో ఇలానే ఉంటుంది.. తీరా షో చూస్తే అంత సీన్ ఉండదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.