telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత నావికాదళంలోకి .. ఐఎన్‌ ఎస్‌ ఖండేరి జలాంత ర్గామి..

INS Submarine joined with navy

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ముంబయి నౌకాశ్రయంలో ఐఎన్‌ ఎస్‌ ఖండేరి జలాంత ర్గామిని నావికాదళంలో ప్రవేశించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అలాగే వైమానిక వాహక నౌక డ్రైడాక్‌ను ప్రారంభించడంతో పాటు ఏడు ప్రాజెక్ట్‌ 17ఎ యుద్ధనౌకల్లో మొదటి నౌకను నీలగిరి జలప్రవేశం చేయించారు. భారత నావికా దళం పాక్‌కు గతంలో కన్నా గట్టిగా బుద్ధి చెబుతుందని అన్నారు. పాక్‌ నావికాదళం 1971లో ఆపరేషన్‌ ట్రైడెంట్‌, ఆపరేషన్‌ పైథాన్‌ పేర్లతో భారత్‌పై దాడులకు యత్నించినపుడు భారత నావికా దళం అసాధారణ పాత్ర పోషించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఐఎన్‌ఎస్‌ ఖండేరి వంటివి భారత నావికాదళంలో చేర్చడంతో నావికాదళం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుందని అన్నారు.

భారత నావికాదళం శాంతికాముక దేశాలకు ఎటువంటి ముప్పు కలిగించదని, హిందూ మహాసముద్ర తీరంలోని అన్ని దేశాలతో పరస్పర విశ్వాసం కలిగి ఉన్నామని ఆయన అన్నారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నౌకల నిర్మాణ పరిశ్రమ ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన లాభాలను గడిస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రణాళికలో ఉన్న 51 నౌకలు, 49 జలాంతర్గాములను దేశీయంగా నిర్మిస్తున్నామని అన్నారు. ఒక యుద్ధనౌక నిర్మాణంతో 48వేల సిబ్బందికి ప్రత్యక్ష ఉపాధి, ఎనిమిదేళ్ల అనంతరం 27వేల పరోక్ష ఉపాధి లభిస్తుందని అన్నారు.

Related posts