telugu navyamedia
సినిమా వార్తలు

సరిగ్గా 18 సంవత్సరాల క్రితం… అలనాటి జ్ఞాపకాల్లో ఎన్టీఆర్

Jr.ntr actor Ycp photos social media

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘స్టూడెంట్ నెం. 1’ చిత్రం 2019, సెప్టెంబర్ 27 నాటికి 18 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 18 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. “స్టూడెంట్ నెం.1 చిత్రం విడుదలై 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అనుకోకుండా ఈ రోజు (సెప్టెంబర్ 27) మా సినిమా (ఆర్ఆర్ఆర్) షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్‌లో స్టూడెంట్ నెం.1 చిత్ర షూటింగ్ జరిగింది. ఈ మధ్య కాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. కానీ రాజమౌళిగారితో కలిసి పనిచేస్తే ఉండే ఫన్‌లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు..’’ అంటూ యంగ్ టైగర్ తన ట్విట్టర్ పోస్ట్ చేశారు. అప్పటి, ఇప్పటి ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు.

Related posts