telugu navyamedia
సినిమా వార్తలు

“మన్మథుడు-2″లో సమంత… క్లారిటీ ఇచ్చిన నాగ్

Samantha-and-Nagarjuna

“మ‌న్మ‌థుడు” సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మ‌రో ఎంట‌ర్‌టైన‌ర్ “మ‌న్మ‌థుడు-2”. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌ (జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న “మ‌న్మ‌థుడు-2” శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నా ఈ సినిమాలో సీనియర్‌ నటి లక్ష్మీ, హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రావు రమేశ్‌, ‘వెన్నెల’ కిశోర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. ఇక “RX100” ఫేమ్ చైత‌న్య భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఈ చిత్రంలో సమంత కీలకపాత్రలో నటిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయం గురించి నాగార్జున ట్వీట్ స్పష్టతనిచ్చారు. సమంత మన్మథుడు-2లో చిన్న రోల్ ప్లే చేస్తోందని, కోడలు పిల్లతో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మన్మథుడు 2 ఫన్ మూవీగా మీ ముందుకు రాబోతోంది అంటూ ట్వీట్ చేస్తూ సమంతతో కలసి ఉన్న పిక్ ని షేర్ చేశాడు నాగ్. నాగ్ ట్వీట్ కు సమంత స్పందిస్తూ “మన్మథుడు-2″లో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ప్రారంభం నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. “మన్మథుడు-2” తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది అని సమంత ట్వీట్ చేసింది.

Related posts