telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో రెండు చిత్రాలు చేయనున్న స్టార్ హీరో

Hrithik

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేయాలని ఆలోచనలో ఉన్నారట. ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో విడుదల కానున్న ఈ రెండు చిత్రాలలో ఒకటి కామెడీ మరియు మరొకటి యాక్షన్ మూవీగా ఉండాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. ఇక ఈ రెండు చిత్రాల కోసం హృతిక్ కథలు వింటున్నారట. ఇక గత ఏడాది రెండు భారీ హిట్స్ తో సాధించడంతో హృతిక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. 2019లో హృతిక్ విడుదల చేసిన సూపర్ 30, వార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. వార్ ఏకంగా 400 కోట్ల వసూళ్ల వరకు రాబట్టి 2019 హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రంగా నిలిచింది. టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా హృతిక్ సూపర్ హిట్ సీక్వెల్స్ “క్రిష్ 4″లో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts