telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏమిటో ఈ పాడులోకం…

చూడు చూడు లోకంలో
వింతలెన్నో..విడ్డూరాలెన్నో…
తృప్తి లేని జీవన విధానంలో
నిందలు నిష్టూరాలే మెండు..
కాలక్షేపానికి కావాలి ఇరుగు పొరుగు
ముచ్చట్లు..
సాయానికి రమ్మంటే క్షణం తీరకలేదనే
మనస్తత్వాలు…
స్వలాభం కోసం క్షీరాభిషేకాలు
పరోపకారం కోసం చుక్కనీరు చిలకరించని
అపర కుబేరులు…
ఊకొట్టే వారుంటే ఉపన్యాసాల
దంపుడు..
ప్రశ్నించే వారుంటే జారుకునే నైజం.
ఎలా ఉన్నావంటే ఏకరువు పెడతారు
అనారోగ్య సమస్యలు..
సహపంక్తి భోజనంలో లాగించేస్తారు
రకరకాల పిండి వంటలు
జిహ్వ చాపల్యం ఏం చేయలేమంటారు
కలిగినోడిని చూస్తే కారాలు మిరియాలు
లేని వాడిని చూస్తే చీదరింపులు,చివాట్లు..
కూడబెట్టింది చూస్తూ రాత్రి పూట జాగారాలు
కంటికి నిద్ర దూరం చేస్తూ.సుఖం లేని బ్రతుకు
వ్యర్దమంటూ…
కష్టాలన్ని తమ గుమ్మం ముందే తిష్టవేసాయంటారు..
తాము తప్పు అందరూ సుఖంగా ఉన్నారని
నిందిస్తారు..
ఇదే ఇదే నేటి మనుషుల నైజం.

Related posts