telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మధురమైన జ్ఞాపకం

ఒక జ్ఞాపకం తట్టి లేపుతుంది
మౌనంగా మనసుకు తగులుతూ
భావాలను బంధించాలని
కవితలై పరవశించాలని…
నిక్షిప్తమైన సమాచారం
శరీరాన్ని బరువుగా కదిలిస్తుంది
ఊహల్లో అల్లుకున్న అక్షరం
గాయమై కవిత్వంగా మారుతుంది…
కండ్ల లోని కన్నీటి బిందువులలో
దోసిలిలో మునిగే బాధలు
పైకి తేలే బ్రతుకులకు
అక్షరమే ఆవిరి పడుతుంది..
కాలము గాయం చేస్తే
కలిసి రాని రోజులో
ఎండమావిలో నీరు మాదిరి
పచ్చదనం మై పరచుకుంటోంది…
స్తబ్ధతగా ఉన్న మనిషికి
ఉషోదయపు కాంతి తగిలితే
ఉత్తేజాన్ని పొంది ఎగిరినట్లు
అక్షర కిరణ స్పర్శ తాకుతుంది..
అలసిన మనసుకు
ప్రకృతిలో సేద తీరితే
రాలిన ఆకులు వికసించినట్లు
వసంత కోకిల గానం వినిపిస్తోంది..

Related posts