telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అలర్ట్ : తెలంగాణకు భారీ వర్షాలు

తెలంగాణకు మరో 3 రోజులపాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి దిశ నుండి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, దక్షిణ బంగళాఖాతంలో కొంత భాగం, నికోబార్ ద్వీపం, దక్షిణ అండమాన్ సముద్రము మొత్తం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొంత భాగాములోకి నైరుతి రుతపవనాలు ఈరోజు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశముంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా – పశ్చిమ బెంగాల్ తీరానికి 26వ తేదీ ఉదయం చేరుకొనే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుండి వీస్తూన్నాయి. దీంతో రాగల 3 రోజులు (21,22,23వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

వాతావరణహెచ్చరికలు:
ఈ రోజు (21వ.తేదీ) ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు(గాలి వేగం గంటకి 30 నుండి 40 కిమి)తో కూడిన వర్షం(ముఖ్యంగా ఆగ్నేయ, దక్షిణ తెలంగాణా జిల్లాలలో) మరియు రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

Related posts