న్యూయార్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నర్సింహ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్ మెంట్, టూరిజం రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిలో చేరేందుకు కావాల్సిన నైపుణ్యతలను పెంచుకుంటే ఉత్తమ ఫలితాలు ఉం టాయని పేర్కొన్నారు. హాస్పి టాలిటీ ఇండస్ట్రీలో అవసరమయ్యే నైపుణ్యతలకు సంబంధించిన పలురకాల డిప్లొమా కోర్సులను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో అందించేందుకు నగరానికి చెందిన ‘మైహోటల్ స్కూల్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రొ. నర్సింహ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఇండియాలో హోటల్ మేనేజ్‌మెంట్‌లో కేవలం 3ఏళ్ల డిగ్రీ కోర్సు మాత్రమే అందు బాటులో ఉందని, 1నుంచి 3నెలల్లో ప్రత్యేక కోర్సులను రూపొందించడంతో పాటు 100శాతం ప్లేస్‌మెంట్‌ను అందించేలా మైహోటల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ సింక్రో సర్వ్ గ్లోబల్ సంస్థ ప్రతినిధి ప్రదీప్‌కుమార్ నామా, శివరామ్ మల్లెల పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రవేశపెట్టనున్న కోర్సుల వివరాలను వెల్లడించారు.
ఆ ప్రాంతాన్ని ప్రజలకే కేటాయించేలా చేస్తాం..