telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పదవులు ఎవడబ్బ సొత్తు కాదు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ponguleti

ఖమ్మంలోని వేంసూర్ మండల పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తన కార్యక్రమాలకు వస్తున్న ప్రజా ప్రతినిధుల పై కక్ష్య పూరితం గా వ్యవహరిస్తున్నారని.. అధికారం శాశ్వతం కాదు…నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధైర్య పాడల్సిన అవసరం లేదని సూచించారు. నేడు పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ టిఆర్ఎస్ చెట్టు నీడలో ఉన్నవారేనని… ప్రజా అభిమానమే మాకు చాలా పెద్ద పదవులు అన్నారు. పదవిని భగవంతుడు మాకు ఇవ్వాలి అన్నప్పుడు ఎవరు అడ్డుపడ్డ ఆ పదవి ఆగదని తెలిపారు. అదే విధంగా పదవి పోయే టైం వచ్చినప్పుడు ఎవరు అడ్డుపడ్డ ఆగదు ఇది వేదాంతం కోసం కాదు చెప్పేది పదవులు ఎవడబ్బ సొత్తు కాదని నేను మొదటినుంచి చెప్తున్నా ప్రజల ప్రేమ అభిమానం మన అబ్బ సొత్తు అని స్పష్టం చేశారు. మనం నమ్ముకున్న ప్రజలు ఆ టైం వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలి అనుకుంటే అది ఇస్తారని తెలిపారు. నష్టపోయిన‌ నాయకులను, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలియని అంతా అసమర్ధుని కాదని…. కక్ష్య సాధింపు చర్యలు ఎవ్వరూ పెడితే వారే తప్పకుండా ఆ ప్రతిఫలం ఆ ఒక్కడే అనుభవించాల్సి ఉంటుంది తప్పకుండా వడ్డీతో చక్ర వడ్డీ తో అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నేను ఎక్కడికైనా వెళ్తాను నాకు ఎవ్వరి పర్మిషన్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు… ఏ పాస్‌ పోర్ట్‌ అవసరం లేదన్నారు.

Related posts