telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా ఆపత్కాలంలో దేశం ఏకతాటిపై నిలిచింది: ప్రధాని మోదీ

కరోనా ఆపత్కాలంలో దేశం ఏకతాటిపై నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 4 వేల మంది అతిథులు హాజరయ్యారు.కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

పతాక ఆవిష్కరణ అనంతరం ఎర్రకోటపై నుంచి మోదీ మాట్లాడుతూ..భారతీయ రక్షణ దళాలు, పోలీసులు దళాలు మనల్ని నిరంతరం రక్షిస్తున్నాయన్నారు. దేశ సరిహద్దులో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు పోలీసులకు వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు.

ప్రపంచంతో పాటు దేశం విపత్కర పరిస్థితుల్లో పయణిస్తోందని అన్నారు. కరోనా తెచ్చిన ముప్పు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రమాణం చేశారు. మహమ్మారి నివారణకు వైద్యులు ప్రజల ఆరోగ్యానికి కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.

Related posts