telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

న్యూజిలాండ్ కాల్పుల్లో గాయపడ్డ హైదరాబాద్ యువకుడు

Fire Nuziland Jahangeer Hyderabad

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల వద్ద ఓ ఆగంతకుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో హైదరాబాద్ వాసి ఇక్బాల్ జహంగీర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జహంగీర్ కుటుంబాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వారు కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఇక్బాల్ కుటుంబానికి వారు హామీ ఇచ్చారు.

15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం న్యూజిలాండ్‌ కు వెళ్ళిన జహంగీర్ అక్కడే స్థిరపడ్డాడు. మొదట్లో కొన్ని రోజులు వేరు వేరు పనులు చేసిన అతడే అనంతరం సొంతంగా భావర్చి పేరుతో ఓ హోటల్ ను నిర్వహిస్తున్నాడు. జహంగీర్ తరచూ హైదరాబాద్ కు వస్తూ కుటుంబ సభ్యులను కలిసేవాడు. ఇలా రెండు నెలల క్రితం రెండు సార్లు హైదరాబాద్ కు వచ్చి వెళ్ళాడు. 

అయితే శుక్రవారం జహంగీర్ ఎప్పటిలాగే ప్రార్థన నిమిత్తం స్థానికంగా వున్న మసీదుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ దుండగుడు తుపాకితో మసీదులోకి ప్రవేశించి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో జహంగీర్ శరీరంలోకి కూడా బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి నిలకడగా వుందని, ఆదివారం శస్త్ర చికిత్స చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts