తెలంగాణ రాష్ట్రంలోని ఏడు పాత జిల్లాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20న సాయంత్రం 6 గంటల నుంచి 22న సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పాత జిల్లాలైన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండలో ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
previous post
next post