ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా వైసీపీ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో శాసనమండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి, టీడీపీకి రాజీనామా చేశారు. దాంతో ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు.
వైసీపీ తరఫున బరిలో దిగిన డొక్కా తప్ప మరెవరూ నామినేషన్ వేయలేదు. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలో టీడీపీ తన అభ్యర్థిని బరిలోకి దించలేదు.