telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తున్న లేడి అరెస్ట్…

crime

బ్యాక్‌డోర్‌ ఉద్యోగాలంటూ మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడిని పోలీసులు అరెస్ట్ చేసారు. కోల్‌కతాకు చెందిన ఓ సైబర్‌ కి‘లేడీ’ని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసారు‌. బెంగళూర్‌ కు చెందిన ప్రతిభ అలియాస్‌ గాయిత్రి ప్రస్తుతం కోల్‌కతాలో నివాసం ఉన్నట్లు గుర్తించారు. తన ఫోన్‌ నంబర్‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌లో పోస్టు చేసి… ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ప్రకటించుకుంటూ అమాయకులకు వల వేస్తుంది. జాబ్‌ కన్సల్టెన్సీల నుంచి డాటా సేకరిస్తు దందా చేస్తుంది ఈ లేడీ. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలలోని ఎంఎన్‌సీ కంపెనీలలో ఉద్యోగాలిప్పిస్తానంటూ తనను ఫోన్‌లో సంప్రదించిన వారిని నమ్మిస్తుంది అని పోలీసులు పేర్కొన్నారు. మొదట అడ్వాన్స్‌గా కొంత తీసుకొని ఉద్యోగం వచ్చేసిందని, అయితే బ్యాక్‌డోర్‌ నుంచి కావడంతో డబ్బులు చెల్లించాలంటూ చెప్తుంది. ఆమె మాటలు నమ్మి లక్ష రూపాయలు చెల్లించిన వారికి కంపెనీల పేరుతో నకిలీ ఈమెయిల్‌ తయారు చేసి దాని ద్వారా నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు పంపిణీ చేస్తుంది. జాబ్ లెటర్ ఇచ్చిన తరువాత సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తుంది. అయితే ఈ కిలాడి లేడీ చేత మోసపోయిన బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. హెచ్‌సీఎల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బ్యాక్‌డోర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.2,42,520లు కాజేసింది. ఈమె చాలామందిని ఇలా మోసం చేసిందని పోలీసులు తెలిపారు.

Related posts