telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సొంత రాష్ట్రాలకు తిరుగు పయనం అవుతున్న వలస కార్మికులు…

ఢిల్లీలో, ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ నుండి చాలా మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు బయలుదేరుతున్నారు. మరొక లాక్ డౌన్ భయంతో వారు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారని చెప్పారు. ఈసారి, డబ్బు మరియు ఆహారం లేకుండా నగరంలో చిక్కుకోకుండా ఉండటానికి పరిస్థితి ముందుగానే ఊహించి ఊరికి వెళుతున్నామని వారు పేర్కొన్నారు. అలాగే ముంబైలోని చాలా మంది వలస కూలీలు కూడా తమ స్వస్థలాలకు వెళుతున్నారు. వైరస్ భయం కంటే, వారు మళ్ళీ ఎక్కడ లాక్ డౌన్ పెడితే ఇక్కడే చిక్కుకుపోతామో అనే భయంతో వారు వెళుతున్నారని తెలుస్తోంది. గత సంవత్సరం, వైరస్ వ్యాప్తి చెందకుండా  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన కారణంగా వారికి ఆదాయం మరియు ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇక ఆనంద్ విహార్ టెర్మినల్ వద్ద ఇంటికి బయలుదేరిన ఒక బీహార్ వలస కార్మికుడు మాట్లాడుతూ మళ్ళీ ఇక్కడ ఇరుక్కోవడం కంటే ఇప్పుడు వెళ్లిపోవడం మంచిది అని పేర్కొన్నాడు. అయితే చూడాలి మరి మన దేశంలో మరొక లాక్ డౌన్ వస్తుందా.. లేదా అనేది.

Related posts