telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో తెలియడం లేదు..

ys jagan cm

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్‌ మరో సారి ఫైర్‌ అయ్యారు. ఇవాళ సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తూ… సభ్యుల మాటలు వినకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోందని.. ఇది దారుణమన్నారు. డిసెంబర్‌ 15న రూ. 1227 కోట్ల బీమా చెల్లిస్తామని.. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు కూడా పంపినీ చేస్తామని హామీ ఇచ్చారు. తాను ఒక మాట చెబితే… ఆ మాట నిలబెట్టుకుంటానని ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబుకు మోసం చేయడమే తెలుసని… టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని ఫైర్‌ అయ్యారు. కనీస అంశాలపై చర్చించకుండా అసలు ఎందుకు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం ప్రసంగం సాగుతున్నా.. అది ప్రజలకు చేరవద్దనే కుట్రతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్‌.

Related posts