telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సైఫ్ పై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరోయిన్…

బాలీవుడ్ హీరోలు రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా గడిస్తునారు. ఇలానే ఓ హీరోగారు కూడా రెండు సార్లు పెళ్లిపీటలెక్కడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు రెండో సతీమణికి ఒక బాబు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంతకు అతగాడు ఎవరా .. అనుకుంటున్నారా .. ? ఆ హీరోగారు ఎవరోకాదు స్టార్ హీరో సైఫ్ అలీఖాన్. ఇంతవరకు బాగానే ఉంది . అయితే ఇప్పుడు ఈ రెండిళ్ళ పూజారి అంటే పడిచచ్చిపోతాను అంటుంది బ్యూటీ. ఆ భామ ఎవరంటే పరిణీతి చోప్రా అలియాస్ పారి. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతంచేసుకుంది. హిందీ లో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది.

అయితే ఈ అమ్మడి అందాలకు ఫిదా కానీ మగడు ఉండడేమో .. అనేంతలా వయ్యారాలు వొలకబోస్తుంది ఈ సొగసరి. పరిణితి ఒకే చెప్పాలికాని పడిచచ్చిపోయే కుర్రాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. కానీ ఈ అమ్మడు పెళ్ళైన సైఫ్ పై మనసు పారేసుకుందట . తన తాజా చిత్రం జబారియా జోడి ప్రమోషన్ కోసం పరిణీతి కోస్టార్ సిదార్థ్ మల్హోత్రాతో ఓ షోలో పాల్గొంది. ఆ షో లో పరిణితి మాట్లాడుతూ.. ‘సైఫ్ అలీఖాన్ ను ప్రేమిస్తున్నాను . సైఫ్ ని తప్ప మరెవరినీ ఇష్టపడను . ఈ విషయం అతడి భార్య కరీనాకు కూడా చెప్పను’. అంటూ ట్విస్ట్ ఇచ్చింది పరిణితిపాప.

Related posts