మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా ‘ఉప్పెన’. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ‘ఉప్పెన’ అన్నీ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో రికార్డ్స్ సాధిస్తున్నాయి. ‘ఉప్పెన’ పూర్తి స్థాయి ప్రేమ కథ కావడంతో వ్యాలంటైన్స్ డే సీజన్లో ఫిబ్రవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మొత్తానికి వైష్ణవ్ సినిమా రిలీజ్ అవకముందే అందరి నుంచి సపోర్ట్ అందుతోంది. ప్రస్తుతం ఉప్పెన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి విడుదల తర్వాత సినిమా ఎలా ఉంటుంది అనేది.
previous post