telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్కూల్ ఫీజులపై ఏపీ సర్కార్ ఆదేశాలు!

school teachers class

వచ్చే విద్యాసంవత్సరం స్కూల్ ఫీజుల పై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. లాక్ డౌన్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కూడా రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్ కాంతారావు పలు ఆదేశాలు జారీచేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఫీజులు కట్టాలని ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. రానున్న విద్యా సంవత్సరంలో ఫీజులు పేరుతో ఎవ్వరికీ అడ్మిషన్లు తిరస్కరించకూడదని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అధిక ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts