telugu navyamedia
ఆరోగ్యం

కరోనా నియంత్రణకు ప్లాస్మా థెరపీతో చిగురిస్తున్న ఆశలు

karona

కరోనా పేషంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ పేషెంట్‌పై ప్రయోగాత్మకంగా అమలుచేసి విజయవంతమయ్యారు. మాక్స్ ఆస్పత్రి వైద్యులు ప్లాస్మా థెరపీ చేయడంతో కోవిడ్ రోగి కోలుకున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోనూ ప్లాస్లా థెరపీ చికిత్సకు భారత వైద్య పరిశోధనా మండలి అనుమతిచ్చింది. త్వరలోనే ఇక్కడ ప్లాస్మా థెరపీ విధానంలో ఎంపిక చేసిన రోగులకు చికిత్స అందించనున్నారు. రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీబాడీ లు ఇందులో ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాలో వైరస్‌ను చంపే యాంటీబాడీలు ఉంటాయి. శరీరంలో ఉన్న వైరస్ కణాలను తెల్ల రక్తకణాలు గుర్తించేందుకు రోగ నిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారుచేస్తుంది. అవి వైరస్ కణాలకు అతుక్కున్న తర్వాత వైరస్ కణాలను తెల్ల రక్తకణాలు గుర్తించి నాశనం చేస్తాయి. అందుకే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను తీసి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రోగులకు ఎక్కిస్తారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆస్పెరిసిస్ విధానం ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. మిగతా రక్త కణాలు మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది. ఒక దాత నుంచి 800 మిల్లిలీటర్ల వరకు ప్లాస్మా తీయవచ్చు. అయితే ఒక్కో కరోనా రోగికి 200 మిల్లీలీటర్ల ప్లాస్మా అవసరం పడుతుంది. అలా ఒక్క వ్యక్తి ద్వారా నలుగురు కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు. ఈ సమయంలో ప్లాస్మా థెరపీ విజయవంతమైతే ఊపిరి పీల్చుకున్నట్లే మరి.

Related posts