telugu navyamedia
ఆరోగ్యం

మీ జుట్టు రాలుతుందా? అయితే ఇవి పాటించండి..!

ప్ర‌స్తుత కాలంలో జ‌ట్టు స‌మ‌స్య ప్ర‌ధానంగా క‌నిపిస్తుంది. ఆడామగ అనే తేడా లేకుండా.. అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేది కురుల సంరక్షణ విషయంలోనే. జుట్టు రాలిపోకుండా ఉండటానికి, ఒత్తుగా పెర‌గ‌డానికి డైలీ డైట్‌లో కొన్ని ఆహార ప‌దార్ధాలు చేర్చాలి.

ఆకుకూరల్లో ఫోలేట్‌, ఐరన్‌, ‘ఎ’, ‘సి’ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలను తినడం వల్ల జుట్టు సమస్యలు తగ్గిపోయి.. ఒత్తైన, నల్లని కురుల్ని పొందచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులోని విటమిన్‌ ‘సి’ కొలాజెన్‌ ఉత్పత్తికి, శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది. ఫలితంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

Skin Health - Proteins Are Important For The Reoccurrence Of Skin Cells

విటమిన్ మరియు ప్రోటీన్ లోపాలు :-
విటమిన్స్ అనేవి మన శరీరానికి మాత్రమే కాదు. అవి మన తలకు, జుట్టుకు కూడా ఉపయోగపడతాయి. విటమిన్ E వల్ల మన తలలో బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుంది. చేపలు తినటం వల్ల కూడా మన బాడీ కి మరియు జుట్టు కి ప్రోటీన్ బాగా లభిస్తుంది.
ఆయిల్ తో స్కాల్ప్ మసాజ్ :-
బాదం ఆయిల్ తో కాని లేదా ఆలివ్ ఆయిల్ తో కానీ మన తలను మసాజ్ చేస్కుంటూ ఉండాలి. దాని వల్ల జుట్టు కుదుళ్ళ వరకు నూనె చేరి మన జుట్టును సురక్షితంగా కాపాడుతుంది.

The best hairbrushes for each hair type

తడి జుట్టును దువ్వెన‌ చేయడం మానుకోవాలి :-
మనం తడి జుట్టును బ్రష్ చేయడం వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దువ్వాలి అనుకుంటే దువ్వెన లో పళ్ళు దూరంగా ఉన్న పక్కనుంచి దువ్వండి. ఒకవేళ చిక్కు తియ్యాలి అనుకుంటే చేతి వేళ్ళను ఉపయోగించండి. దాని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

రోజుకు 30 నిమిషాలు వాక్ గాని సైకిలింగ్ కానీ చేయాలి. దాని వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల జుట్టు కూడా రాలడం తగ్గుతుంది.అంటే దీనర్థం శారీరిక శ్రమ పెంచుకోవాలి మరియు తల కు చెమట పట్టకుండా చూసుకోవాలి. చెమటతో అలా వదిలేస్తే డాండ్రఫ్ పెట్టేసి జుట్టు ఇంకా పాడైపోతుంది. జుట్టుకు కలర్ వేసుకోవడం వంటివి చేయకూడదు. సాధ్యమైనంత వరకు అటువంటి కెమికల్స్ కు దూరంగా ఉండాలి.

13 Health Benefits of Regular Morning Walk - HealthifyMe

ఇవన్నిటి కంటే ముందు ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం బాగుంటేనే జుట్టు కూడా బాగుంటుంది. మన ఆరోగ్యం పైనే జుట్టు పెరుగుదల ఆధారపడి ఉంటుంది..క్రమం తప్పకుండా ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తే జుట్టు చాలా సురక్షితంగా కాపాడుకోవచ్చు.జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ ని తప్పక ఫాలో అవ్వండి. అలా చేస్తే తప్పక మార్పులు కనబడతాయి.

Related posts