telugu navyamedia
ఆరోగ్యం

కడుపులో నులిపురుగుల స‌మ‌స్యా ఉందా…!

ప్ర‌తి వ్య‌క్తి సాధార‌ణంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో నులిపురుగులు స‌మ‌స్య ఒక‌టి. నిజానికి ఈ స‌మ‌స్య చిన్న పిల్ల‌ల్లో అధికంగా ఉంటుంది. ఎందుకంటే వారికి తియ్య‌టి ప‌దార్ధాలంటే చాలా ఇష్టంగా తింటుంటారు. తియ్య‌టి ప‌దార్ధాలు తిన్న‌ప్పుడు గాని..ఏదైనా ప‌డ‌ని వ‌స్తువులు రెండు క‌లిపి తిన్న‌ప్పుడు గాని ఈ నులిపురుగులు స‌మ‌స్య ఏర్ప‌డ‌తాయి.

దీని ప్ర‌భావంతో పొట్టంతా మెలిక‌లు తిప్పిన‌ట్టుగా ఉండే నొప్పితో పాటు అజీర్ణం, వాంతులు, వికారం, జ్వ‌రం, తుమ్ములు, ఆక‌లివేయ‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. 19 ఏళ్లలోపు పిల్లలపై నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి రోగాల బారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు.

Deworming in toddler, symptoms of worm infestation in toddler, worm prevention for humans

పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు తిష్ఠ వేస్తాయి. అవి.. ఏలిక పాములు (ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్), కొంకి పురుగు (ఆంకైలోస్టోమా డియోడెనేల్), చుట్టపాములు (టీనియా సోలియం). ఇవి 55 అడుగులు పెరిగి 25 ఏండ్ల వరకు బతుకుతాయి.

దీని నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గాలేంటో తెలుసుకొందాం..

* నారింజ కాయ తొక్క‌ల‌ను తీసి ఎండ‌బెట్టి పొడి చేసి.. ఈ పొడిని గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి ప‌ర‌గ‌డుపున మూడు రోజుల పాటు తీసుకుంటే నులిపురుగులు పోతాయి.

* చెరుకు ర‌సంలో 25గ్రాముల శ‌న‌గ‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

* ఇంట్లో ప్రతిరోజూ కాచి, చల్లార్చిన నీటినే తాగాలి. * పండ్లు, కూరగాయలను పరిశుభ్రంగా కడిగిన తరువాతే వినియోగించాలి. ముఖ్యంగా మాంసాహారం విషయంలో ఈ శుభ్రత మరింత అవసరం.

* గోర్లు కొరికే అలవాట్లు ఉంటే మానుకోవాలి.

* మలవిసర్జనకు వెళ్లి వచ్చిన తరువాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.

* అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఆహారం తినకూడదు.

* ముందుగా నులిపురుగుల సమస్యతో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
.
* కొబ్బరి తురుము కూడా నులిపురుగులకు చక్కని మందులా పనిచేస్తుంది.

* క్యారెట్ తురుమును వరుసగా వారం రోజులపాటు తింటే కడుపులోని పురుగులు మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి.

అయితే.. ఒక్కసారి కడుపులో పురుగుల సమస్య వచ్చిందంటే చాలు.. అవి వాటి సంతానాన్ని త్వరగా వృద్ధి చేసుకుంటాయి. కానీ వీటి నివారణ మాత్రం అంత సులభం కాదు. డాక్టరు సలహాతో మాత్రమే మందులను తీసుకోంటే మంచిద‌ని చెబుతున్నారు.

Related posts