telugu navyamedia
సినిమా వార్తలు

“పాగల్” లవర్ స్టోరీ అదుర్స్‌..

ఫలక్ నుమా దాస్, హిట్ లాంటి సినిమాల తర్వాత విశ్వక్ సేన్ ఇమేజ్ బాగానే పెరిగిపోయింది. హిట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ లవర్‌బాయ్‌గా నటించిన మూవీ ‘పాగల్’ను ఈ నెల 14న విడుదల చేయనున్నారు.

తాజాగా సినిమాకి సంబందించిన పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్ర బృందం ఇప్పుడు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 2 నిమిషాల 16 సెకండ్స్ నడిచిన ఈ వీడియో లో విశ్వక్ సేన్ తన కూల్ లుక్‌తో బాగా ఆకట్టుకున్నాడు. సినిమా పోస్టర్ చూస్తేనే ఇది ఒక ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది.

Paagal (2021) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

‘నా పేరు ప్రేమ్‌. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను’ అని విశ్వక్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ అలరిస్తూనే భావోద్వేగానికి గురిచేస్తోంది. సినిమాలో విశ్వక్ సేన్ ప్రేమ్ అనే పాత్రలో కనిపిస్తాడు. ఎప్పుడూ స్నేహితులతో సరదాగా తిరుగుతూ అమ్మాయిల గురించి ఆలోచించే విశ్వక్ కి సడెన్‌గా నాయిక నివేదా పరిచయమవుతుంది.

అంతే.. తన జీవితం మారిపోతుంది. ‘చూడు.. ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పటి నుంచి ఒకెత్తు. నేను చాలామంది అమ్మాయిలకు ఐ లవ్‌ యు చెప్పాను. కానీ, నిన్ను మాత్రమే లవ్‌ చేస్తున్నా’ అని తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. ‘నువ్వూ నేనూ కలిసుండటం జరగదు. అది మనద్దరికీ మంచిది కాదు’ అని బదులిస్తుంది హీరోయిన్‌. మరి ప్రేమ్ పరిస్థితి ఏమైంది? అనే పాయింట్ చుట్టూ మిగతా సినిమా తిరగనుంది.

గీత ఎక్కడుంటుంది సర్‌ అని విశ్వక్‌ని ఓ వ్యక్తి అడగ్గా.. గీతకి సంబంధించి పెద్ద జాబితాని బయటపెట్టే సంభాషణ అలరిస్తుంది ఈ ట్రైలర్ చూస్తే సినిమా అందరికీ ఆకట్టుకుట్టుకునే విధంగానే ఉంటుందని తెలుస్తోంది. నరేశ్ కుప్పిలి దర్వకత్వంలో నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. 

Related posts